ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ శాఖ మీడియా సమావేశం

పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.. దాడులతో పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెంచుతోంది.
పాకిస్తాన్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొడుతోంది.. శ్రీనగర్, ఉధంపూర్, బటిండా, భుజ్ లో దాడులకు పాల్పడుతోంది.
శ్రీనగర్ నుంచి నలియా వరకు పాక్ భారీ దాడులకు పాల్పడుతోంది.. భుజ్, బటిండాలోని ఎయిర్ స్టేషన్లపై పాక్ దాడి చేసింది.
పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ లాంచర్లను ధ్వంసం చేశాం.. సామాన్య పౌరులకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగేలా పాక్ పై దాడులు చేశాం.
భారత్ లోని కీలక వ్యవస్థలపై దాడులు చేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది.. భారత సైనిక బలగాలు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయి.
పాకిస్థాన్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ లతో దాడులు చేస్తోంది.
– విదేశాంగ శాఖ
– “అక్షర ఉదయమ్” న్యూస్