ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్షా సమావేశం

ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్షా సమావేశం

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ నందమూరి తారక రామారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఆధ్వర్యంలో గురజాల నియోజక వర్గ స్థాయి ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ, ఆర్డీవో మురళీకృష్ణ, నియోజక వర్గ పరిధిలోని, జిల్లా స్థాయి అధికారులు, మండల తహసీల్దార్లు, నియోజక వర్గంలోని మండల, గ్రామ స్థాయిల్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ శాఖ, బ్యాంకు రుణాలు, రెవెన్యూ, అటవీ భూములు, పంచాయితీ రాజ్, మెడికల్ అండ్ హెల్త్, వివిధ శాఖల అధికారుల నుంచి నివేదికల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం క్రింద కూలీల సంఖ్య పెంచడంతో పాటుగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని, అదే విధంగా గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు అధికారులకు సూచించారు.

వేసవిలో తాగు నీటి సరఫరాలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. డివైఎఫ్ఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారులకు, నియోజక వర్గ పరిధిలోని తహసీల్దార్లకు సూచించారు. గత ఐదేళ్లలో గురజాల నియోజక వర్గంలోని పొందుగల, తంగెడ, మాడుగుల, గొట్టెముక్కల, దైద గ్రామాల్లో ప్రభుత్వ భూములను కొందరు వైసీపీ నేతలు పట్టా భూములుగా మార్చుకొని బ్యాంకులలో రుణాలు పొందిన వైనంపై ప్రత్యేక అధికారులతో రికార్డుల పరిశీలన, గ్రామ స్థాయిలో విచారణ చేపట్టి, త్వరలో నివేదిక అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గురజాల నియోజక వర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వున్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి సమీక్షా సమావేశంలో అధికారులు, నాయకులతో చర్చించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..