మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ రాయపాటి ఆకస్మిక తనిఖీలు

మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ రాయపాటి ఆకస్మిక తనిఖీలు

 


అక్షర ఉదయమ్ – గుంటూరు

ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గుంటూరులోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, బాలల పరిరక్షణ విభాగం, గృహ హింస నిరోధక విభాగం, ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఆకస్మికంగా పరిశీలించారు

శక్తి సదన్‌లో ఉండే బాధిత మహిళలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మహిళలకు ఉపాధి అవకాశాలు, అవసరమైన సహాయాలు అందిస్తున్నామని తెలిపారు.

గత వైసీపీ పాలనలో దిశా చట్టం పేరుతో మహిళలను మోసం చేశారని, కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.

రాబోయే రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తామని, రాజధాని మహిళ రైతులపై జరిగిన దాడులపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..