పేదల కోసం నిరంతర పోరాటాలు చేసే పార్టీ సిపిఐ
– సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ అన్నారు. గురువారం పిడుగురాళ్ళ పట్టణం ఆర్టీసీ డిపో సమీపంలోని ఎస్టీయు భవన్లో సిపిఐ పిడుగురాళ్ళ మండలం మహాసభ షేక్ హసన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల మీద పోరాడేది సిపిఐ పార్టీ అని అన్నారు. అర్హులైన పేదలకు మూడు సెంట్లు నివేశ స్థలాలు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలను త్వరగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక, దేశంలో దళితులు మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు బాగా పెరిగి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ అనేక పోరాటాలు చేసి, విజయాలను సాధించిందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలు కడతామని పల్నాడు ప్రాంతంలో రైతుల వద్ద నుంచి పొలాలు తీసుకొని ఇంత వరకు నిర్మించ లేదని అన్నారు. వెంటనే సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొమెర వెంకట్రావు, అక్కినపల్లి బాలయ్య, షేక్ కరీముల్లా, గంగాధర్ పాల్గొన్నారు.

– సిపిఐ పిడుగురాళ్ళ మండల కార్యదర్శిగా అక్కినపల్లి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిడుగురాళ్ళ మండల మహాసభ సందర్భంగా సిపిఐ పిడుగురాళ్ళ మండల కార్యదర్శిగా అక్కినపల్లి బాలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 13 మంది కమిటీ సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా షేక్ హసన్, గంగాధర్, ఆలకుంట శ్రీను, రవి, చల్లా గురువారెడ్డి, గొట్టిముక్కల రాజు, కరీముల్లా, వల్లెపు యల్లారావు, షేక్ సైదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొమెర వెంకట్రావు, గంగాధర్, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..