ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభించాం
- మోడీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్
- గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం
- దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం
- బాబు సూపర్ సిక్స్ లో ‘తల్లికి వందనం’ హామీ నిలబెట్టుకున్నాం
- ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ‘తల్లికి వందనం’
- సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి
- ప్రజల ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉంది
- కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్

అక్షర ఉదయమ్ – ఉండవల్లి
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి, ప్రజా పాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధాన మంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. డీఎస్సీని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ప్రతి పక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. 24వ కేసు కూడా సుప్రీం కోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం.
గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకు వచ్చాం
గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకు రావడం జరిగింది. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్ మెంట్స్ లో ఏపీ భారత దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 16శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈ రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం. రైల్వేజోన్ సాధించాం. అంతే కాకుండా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగ వంతంగా జరుగుతున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నాం. వికలాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతినెలా రూ.15వేలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడ పడుచులకు అందించడం జరిగింది. గ్యాస్ పథకంలో సవరణలు తీసుకువచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
బాబు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నాం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేయడం జరిగింది. గురువారం నుంచి నగదు తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. రూ.13వేలు తల్లుల అకౌంట్లలో పడతాయి. రూ.2 వేలు పాఠశాలల్లో మెయింటెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేయడం జరుగుతుంది. తల్లికి వందనం కింద దాదాపు 60 శాతం కుటుంబాలు ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారికి ఇద్దరుంటే రూ.26వేలు, ముగ్గురుంటే రూ.39వేలు వస్తాయి. వారి అకౌంట్లలోనే నగదు జమ చేయడం జరుగుతుంది. బాబు సూపర్ సిక్స్ లో మరొక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరిగింది.
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మాండేట్ ఇచ్చారు. ఓ వైపు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ, ప్రజలు ఏ ఆశతో కూటమికి 94 శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉందన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..