రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఆర్యవైశ్య ప్రముఖులు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా పిడుగురాళ్ళ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు స్వామివారి రథోత్సవం జరిగే ప్రాంతాన్ని కలియ తిరిగి, ఏర్పాట్లను పరిశీలించారు.

ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కనిగిరి శ్రీనివాసరావు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు కొత్త రఘురామయ్య, కొత్త (వనజ) సాంబశివరావు, మద్దాలి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.