
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ఆర్యవైశ్య ప్రముఖులు కనిగిరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొత్త (వనజ) సాంబశివరావు, కాకుమాను గోపి, కాకుమాను శ్రీనివాసరావు, మద్దాలి సుబ్బయ్య, కొత్త కోటేశ్వరావు (కొత్త కోటి), కనకమర్లపూడి రామకృష్ణ, ఆముదాల చిన గంగయ్య, కొత్త వెంకట రమణ, ఆతుకూరి వివేక్, భవిరిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు.