బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

తాజాగా కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో వార్షిక బడ్జెట్ను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్-2025ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వ సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్పై వేతన జీవుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ట్యాక్స్ శ్లాబులను 6 నుంచి 3కు కుదించే అవకాశం ఉంది.