అక్షర ఉదయమ్ – బాపట్ల

కాపు కులానికి చెందిన ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఉచితంగా అందజేస్తున్నట్లు కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. బాపట్లలోని కాపు కళ్యాణ మండపంలో కాపు కులానికి చెందిన ఒంటరి మహిళలకు గ్రైండర్లు, కుట్టు మిషన్లు శుక్రవారం అందజేశారు. ఎవరైతే ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారిని గుర్తించి కాపు సేవా సంంఘం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.