శ్రమదానంతో రహదారి నిర్మాణం

📰 Generate e-Paper Clip

అక్షర ఉదయమ్ – అల్లూరి సీతారామరాజు జిల్లా

పినకోట శ్రమదానంతో రహదారి నిర్మాణం
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ పరిధి గుమ్మంతికి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణంపై ఐటీడీఏలో జరిగిన స్పందనలో అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదని, గ్రామస్తులంతా ముందుకొచ్చి పినకోట నుంచి గుమ్మంతి వరకు 2 కిలోమీటర్ల మట్టిరోడ్డు శ్రమదానంతో నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలను తీర్చాలి అని అన్నారు.