వృద్ధురాలి సమస్యను ఆలకించి.. స్వయంగా వివరాలు రాసుకున్న
– గురజాల ఎమ్మెల్యే యరపతినేని

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో గురువారం మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రీవెన్స్ పూర్తయ్యాక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాకు చేరుకున్నారు. ఆ సమయంలో పిడుగురాళ్ళ చినఅగ్రహారం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన సైదమ్మ అనే 80 ఏళ్ల పైబడిన వృద్ధురాలు యరపతినేనిని చూసి మీతో నా సమస్య చెప్పాలని కోరగా, దీనికి స్పందించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అంత హడావుడి కార్యక్రమంలోనూ వృద్ధురాలు సైదమ్మ సమస్యను ఆలకించారు. యరపతినేని ఆమె పక్కనే కూర్చోగా సైదమ్మ చెప్పిన తన కుమారుడు ఇంట్లో ఓ గదిలో నేను వుంటున్నానని, నేనున్న గదికి విద్యుత్ సరఫరాను తొలగించి నన్ను బయటకు నెట్టేసేలా కఠినంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని కన్నీటి పర్యంతమై వివరించారు. ఆమె సమస్యలు స్వయంగా యరపతినేని పేపరుపై రాసుకొని సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..