అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. బాలయ్య అభిమానులకు భారీ షాక్

అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. బాలయ్య అభిమానులకు భారీ షాక్

 

అక్షర ఉదయమ్ సినిమా న్యూస్

 

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న ‘అఖండ 2 తాండవం’ సినిమా ప్రీమియర్ షోలు సాంకేతిక కారణాల వల్ల రద్దయ్యాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఒక రోజు ముందుగా రాత్రి 8 గంటలకు భారతదేశవ్యాప్తంగా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో మేకర్స్ షాకింగ్ ప్రకటన చేశారు.

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈరోజు జరగాల్సిన అఖండ 2 ప్రీమియర్లు సాంకేతిక సమస్యల వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేం శాయశక్తులా ప్రయత్నించాం, కానీ కొన్ని విషయాలు మా నియంత్రణలో లేవు. అసౌకర్యానికి క్షమించండి అంటూ పోస్ట్ చేసింది. భారతదేశంలోని అన్ని ప్రీమియర్ షోలు రద్దు అయినప్పటికీ విదేశాల్లో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.

ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ‘అఖండ’ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై హైప్ ఆకాశాన్నంటింది. ట్రైలర్, టీజర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చినా, ఈ రద్దు అభిమానుల్లో నిరాశ కలిగించింది. రేపు రెగ్యులర్ షోలతో సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ధృవీకరించారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.