
గురువారం (15-05-25) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అలాగే రేపు ఉష్ణోగ్రతలు 41-43°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లిలో తీవ్రవడగాలులు, శ్రీకాకుళం-1, విజయనగరం-16, పార్వతీపురంమన్యం-10, అల్లూరి-1, కాకినాడ-5, తూర్పుగోదావరి-1 మండలాల్లో(34) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇవాళ ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత, అలాగే శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 53.5మిమీ, రాగోలులో 49.2మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..