క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ గారు

అమరావతిలో అధికారుల కోసం 4,000 ఇళ్లను ఏడాది లోపు పూర్తిచేయాలనే లక్ష్యంతో చర్యలు.
అమరావతికి మొత్తం 10,000 ఎకరాల భూమి అవసరం.
కాలుష్యం లేని పరిశ్రమల కోసం 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500 ఎకరాలు, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు కావాలని సీఎం గారి ఆదేశాలు.
ల్యాండ్ పూలింగ్ వల్ల రైతులకు నష్టం ఉండదని ప్రజాప్రతినిధుల అభిప్రాయం.
ఏ విధానం అమలవ్వాలో గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచన.
క్రెడాయ్ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ.

రియల్ ఎస్టేట్ అభివృద్ధితో అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న జీవోలను పరిశీలించి, వాటిలో చాలా వాటిని రాష్ట్రంలో అమలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బోండా ఉమా పాల్గొన్నారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..