టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగం

అక్షర ఉదయమ్ – మంగళగిరి
ఎన్నికల్లో 94 శాతం స్టైక్ రేట్ తో అఖండ విజయం సాధించాం. మూడు పార్టీలు ఎప్పటి కప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం.
విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పాం.
ఐదేళ్లలో మనం ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించాం.. ప్రజలు పెట్టిన ఆకాంక్షలను మనం కాపాడుకోవాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం మన బాధ్యత.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. భవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
ఎన్నికల్లో జనాభా దమాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది.
ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేశాం. ఐటీ విప్లవాన్ని అంది పుచ్చుకున్నాం. చేసిన పనిని ప్రజలకు చెప్పడం కూడా చాలా ముఖ్యం.
– సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకున్నాం. 2014 – 19 మధ్య మంచి పరిపాలన అందించాం.
వైసీపీ హయాంలో రాష్ట్రం బాగా దెబ్బతింది. ధ్వంసమైంది. ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను పక్కదారి పట్టించారు.
సుమారు 85 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం.
రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా మనం పని చేస్తున్నాం. ప్రజలకు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనం ఎప్పుడూ చేయం.
కేంద్రం కూడా మనకు బాగా సాయం చేస్తోంది. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని నేను చెప్పడం లేదు.
ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాలి. అదే మన లక్ష్యం.
– సీఎం చంద్రబాబు
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..