
ఏపీ బడ్జెట్లో శాఖల వారీగా నిధులు కేటాయింపులు ఇలా
– అక్షర ఉదయమ్ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలి సారి.
ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. 2025-26కు సంబంధించి రూ.3,22,359 కోట్ల భారీ బడ్జెట్ ను రూపొందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు కూడా చేశారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ముందు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ నిర్వహించారు. కాగా బడ్జెట్ సమావేశంలో రాజధాని అమరావతికి కేటాయించిన నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమరావతికి ఆర్థిక మంత్రి రూ.6 వేల కోట్లు కేటాయించారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటం మరువ లేనిదని మంత్రి అన్నారు. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతితో పాటు ఏఏ రంగాలకు ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో చూద్దాం..
వ్యవసాయ బడ్జెట్ – రూ.48 వేల కోట్లు
పాఠశాల విద్యా శాఖ – రూ.31,806 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.23,260 కోట్లు
వైద్యారోగ్య శాఖ – రూ.19,265 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.18,848 కోట్లు
జల వనరుల శాఖ – రూ.18,020 కోట్లు
పురపాలక శాఖ – రూ.13,862 కోట్లు
ఇంధన శాఖ – 13,600 కోట్లు
రవాణా శాఖ – రూ.8,785 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.11,632 కోట్లు
సాంఘిక సంక్షేమం కోసం రూ.10,909 కోట్లు
ఆర్థికంగా వెనుక బడిన వారి సంక్షేమం కోసం 10,619 కోట్లు
అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
పోర్టులు, ఎయిర్ పోర్టులు రూ.605 కోట్లు
ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు
ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.27,518 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు
బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్ షిప్‌లకు రూ.3,377 కోట్లు
స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
జల్‌జీవన్ మిషన్‌కు రూ.2,800 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.500 కోట్లు