పీ.ఎం. స్వానిధి క్రెడిట్ కార్డులు, రుణాల చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

అక్షర ఉదయమ్ – నరసరావుపేట
శుక్రవారం ఉదయం నరసరావుపేట టౌన్ హాలులో పీ.ఎం. స్వానిధి క్రెడిట్ కార్డులు, రూ.లక్ష రూపాయల రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఎస్.బి.ఐ ఆర్.ఎం. రవి కుమార్, మెప్మా పీ.డీ. గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 995 మంది చిరు వ్యాపారులకు స్వానిధి క్రెడిట్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. ఏ విధంగా అయితే బ్యాంకులో స్వానిధి రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తారో అదే విధంగా ఈ క్రెడిట్ కార్డు ద్వారా స్వీకరించిన సొమ్మును మరుసటి నెలలో చెల్లించాలని అన్నారు. 1000 మంది లబ్ధిదారులకు ఎస్బిఐ, యూనియన్ బ్యాంకుల ద్వారా అందించిన రుణాల చెక్కులు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు పేద కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, ప్రతి మహిళ స్వయం సమృద్ధిగా ఎదగాలన్నదే ప్రభుత్వాల సంకల్పమన్నారు. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళా పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని అన్నారు.