ఆస్తి రాయించుకుని తరిమేశారని వృద్ధ దంపతుల ఆవేదన

అక్షర ఉదయమ్ – పత్తికొండ

 

డోన్ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గంగిరెడ్డి, సుబ్బరత్నమ్మను కన్న కొడుకులు ఆస్తి
రాయించుకుని తరిమేశారని వాపోయారు.
సోమవారం పత్తికొండలో వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము కష్టపడి సంపాదించిన ఇల్లు, ఆస్తులన్నింటినీ కుమారులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన చెందారు.