జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్

అక్షర ఉదయమ్ – ఢిల్లీ
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ జనాభా గణన ప్రక్రియ వేగంగా సాగుతోంది. సోమవారం (జూన్ 16) జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆదివారం హోం మంత్రి జనాభా గణనపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా జనాభా గణన 2027లో జరగనుంది. మొత్తం రెండు దశల్లో జనాభా గణన జరగనుంది.
మొదటి దశలో ఇంటి జాబితా ఆపరేషన్ ద్వారా గృహాల పరిస్థితి, ఆస్తులు, సదుపాయాలకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. రెండవ దశలో జనాభా గణన చేస్తారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. ఇందులో కుల గణన కూడా నిర్వహించ నున్నారు.
1931 తర్వాత తొలిసారిగా ఈ జనాభా గణనలో కులాల వివరాలు కూడా సేకరించ నున్నారు. ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా నిర్వహించ నున్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
మార్చి 1, 2027నుంచి దేశ వ్యాప్తంగా జనాభా గణను చేపట్టనున్నారు. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో మాత్రం ముందుగా అంటే అక్టోబర్ 1, 2026నుంచి జనాభా గణన నిర్వహించ నున్నారు. ఈ భారీ ప్రక్రియ కోసం సుమారు 34 లక్షల ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు1.3 లక్షల మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారు.
జనాభా గణన ప్రక్రియకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత 8వ జనాభా గణన. మొత్తం మీద 16వ జనాభా గణన. గతంలో 2021లో జరగాల్సిన జనాభా గణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..