గుంటూరు పోలీస్ డ్రోన్ కెమెరాలతో గస్తీ

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ హనుమంతు గారు, ఆర్టిఓ గంగాధర్ గారు, వెస్ట్ డీఎస్పీ శ్రీ అరవింద్ గారుల ఆధ్వర్యంలో స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

డ్రోన్ కెమెరాలతో గస్తీ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనతో పాటు, ఓపెన్ డ్రింకింగ్ పై పటిష్ఠ నిఘా. నూతనంగా డ్రోన్ కెమెరాలతో గస్తీ విధానాన్ని ప్రారంభించటం జరిగింది

మద్యం తాగి వాహనాలు నడిపినా, స్నేక్ డ్రైవింగ్ చేసినా, పెద్ద శబ్దాల సైలెన్సర్లతో వాహనాలు నడిపినా వారి వాహన లైసెన్స్ రద్దు చేస్తాం అని, మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమాని, మైనర్ ల తల్లిదండ్రుల పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ గారు తెలిపారు.


స్థానిక గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద పట్టాభిపురం, అరండల్ పేట, గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ వారు మరియు ఆర్టీవో అధికారులు స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, స్నేక్ డ్రైవ్, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, పెద్ద శబ్దాలు కలిగిన సైలెన్సర్లతో వాహనాలు నడిపిన వారి పై కేసులు నమోదు చేసి, అపరాధ రుసుము విధించడం జరిగినది.

ఈ స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్ లో వాహనదారులకు ట్రాఫిక్ నియమ – నిబంధన పట్ల అవగాహన కల్పిస్తూ, వాహనదారులు పాటించవలసిన పలు రోడ్డు భద్రతా నియమాలను, అదే విధంగా హెల్మెట్ ధరించవలసిన ఆవశ్యకతను, ప్రమాదాల సమయంలో భీమా పొందుటలో లైసెన్సు ఉండడం వలన కలిగే ఉపయోగాలను అదనపు ఎస్పీ(ఏఆర్) శ్రీ హనుమంతు గారు వివరించినారు.

గుంటూరు నగరంలోని రహదారుల వెంబడి పలు ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. వాటి ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేసి స్నేక్ డ్రైవ్ చేసినా, పెద్ద శబ్దాలతో వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని కనిపెట్టి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించడం జరిగింది.