అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాల నియోజక వర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతూ హాస్పటల్లో చికిత్స చేయించుకుని, ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21 మంది లబ్ధిదారులకు 21,07,128 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ పట్టణంలోని కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.