అక్షర ఉదయమ్ – చేరుకుపల్లి

రహదారి పై ప్రయాణించే ప్రతి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చేరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ అన్నారు, ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హైకోర్టు వారి ఆదేశానుసారం తప్పనిసరిగా ప్రతి వాహనదారులు రహదారి పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి లేనిపక్షంలో ఫైన్ విధిస్తామని, సేఫ్ డ్రైవింగ్ కి ప్రాధ్యానం ఇవ్వాలన్నారు.