
అక్షర ఉదయమ్ – శ్రీహరి కోట: భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలు రాయిని చేరుకోవడానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ – ఎఫ్15 రాకెట్ ను రోదసిలోకి పంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారు జామున 2.53 గంటలకు ప్రారంభించింది. 27 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.