అక్షర ఉదయమ్ – పెదకాకాని (గుంటూరు)

ఈనెల 26 మహాశివరాత్రి పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముస్తాబయింది. ఈ నెల 23 నుండి వచ్చే నెల మార్చి 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణధికారి గోగినేని లీలా కుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
