నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా

అక్షర ఉదయమ్ – బాపట్ల: బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో ఈ నెల 31వ తేదీన బాపట్ల నియోజక వర్గ నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. 50కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అర్హత 10వ తరగతి నుండి పిజి వరకు, జాబ్ మేళాకు వచ్చే వారు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో , విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని రావాలని కోరారు. రిజిస్ట్రేషన్ ఉచితమని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎజి కాలేజీ ఎదురు, సూర్యలంక రోడ్డు, బాపట్లలో సంప్రదించండి : 8500015566, 8179192707.
లేదా క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆఖరి తేదీ జనవరి 30 వరకు మాత్రమే
https://docs.google.com/forms/u/0/d/e/1FAIpQLSdYNaM7JDq6M6XVN4f8C8vI7fDsAkSnyCxn_mz3XOc-v4B5aA/viewform?usp=send_form&pli=1