
– న్యూ రాజమండ్రి ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
అక్షర ఉదయమ్ – రాజమహేంద్రవరం: ఏ ఎండకా గొడుగు పట్టే కార్మిక నాయకులు మనకొద్దని, మన కోసం పాటు పడే నాయకులనే అనుసరించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ది న్యూ రాజమండ్రి ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వాసు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా టీఎన్టీయుసి అధ్యక్షులు (మాజీ) ఏపీ స్టేట్ మినిమం వేజెస్ ఆఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ నక్కా చిట్టిబాబు, టిడిపి నాయకులు మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ, మన్యం నవీన్ కుమార్, సత్య సాయి, శ్రీకాకొల్లు సూర్య మాణిక్యం అతిధులుగా పాల్గొన్నారు. బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వైసిపి ముసుగులో కార్మికులను అడ్డం పెట్టుకుని చేసిన ఆగడాలు చూశామని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ జెండా పట్టుకోవడం కాకుండా నిద్రలో లేపినా సరే, నాది తెలుగుదేశం అని కానీ, ఎన్డీయే కూటమి అని కానీ ధైర్యంగా జీవించ గలిగేలా ఉండాలని పేర్కొన్నారు. కార్మికులు తమకు ఇష్టమైన పార్టీని అభిమానించడాన్ని తప్పు పట్టరాదని అయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు మాకొద్దని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు తమ కోసం పాటుపడే ఇష్టమైన నాయకుణ్ణి ఎంచుకోవచ్చని, అయితే తమ కోసం అనునిత్యం పాటుపడే నక్కా చిట్టిబాబు వంటి నాయకులను అనుసరిస్తే మంచిదని ఆయన సూచించారు. కార్మికులకు కట్టే భవనాన్ని అసలు సిసలైన కార్మికులకే అప్పగిస్తానని ఆయన చెప్పారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ పూర్వం కరెంట్ లేనపుడు ఇళ్లల్లో దీపాలు వెలిగించే వారని వీధుల్లో సైతం లాంతర్లు పెట్టే వారని గుర్తు చేశారు. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులు ఉంటున్నాయని, ఇందులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు ఎన్నికయ్యాక అసోసియేషన్ ని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నామని అన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ యాళ్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కోమండురి గణేష్ బాబు, సెక్రటరీ పత్తి మహేష్( శివ), జాయింట్ సెక్రెటరీ మరడ పరశురామ్ (రాము), ట్రెజరర్ బోడకుర్తి గోపాలకృష్ణ (గోపి), గౌరవ అధ్యక్షులు కోలాటి సువర్ణరాజు, గౌరవ సలహాదారులు పాలెపు బాలకోటి మహేశ్వరరావు (బాల), స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోసి,
కమిటీ మెంబర్లు ఎండి గపూర్ బేగ్, కులపాకుల దుర్గాప్రసాద్, కొండపల్లి సతీష్ కుమార్, ఈది బిల్లి సూర్యప్రకాష్, చీకట్ల వెంకటేశ్వరరావు (చిన్ని), పట్టపు నాగ వెంకట గోపాలకృష్ణ, ఆశపు నరేష్, దిగమర్తి చంద్రశేఖర్ (చిట్టి), పల్లా సీతారామాంజనేయులు పవన్, గెద్దా దుర్గాప్రసాద్ (బాబి) తదితరులు పాల్గొన్నారు.