
అక్షర ఉదయమ్ – పల్నాడు
గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శనివారం నియోజక వర్గ ప్రజలందరికీ “విశ్వావసు” నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజక వర్గ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, పాడి, పంటలతో, ఆయు, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని ఎమ్మెల్యే యరపతినేని చెప్పారు. “విశ్వావసు నామ సంవత్సరం” సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని, ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులైన తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు వంటి అభిరుచులతో పాటు ఆనందం, బాధ, కోపం, ఉత్సాహం, నేర్పుగా ఉండటం, కొత్త సవాళ్లను ఎదుర్కోవడం వంటి భావోద్వేగాలను సూచిస్తుందని యరపతినేని అన్నారు. ఉగాది పచ్చడి ఏడాది పొడవునా జీవితంలో అందించే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండటాన్ని సూచిస్తుందని తెలిపారు. నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ వృద్ధి జరగాలని, రైతులతో పాటు అన్ని వృత్తుల ప్రజలు ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.