అక్షర ఉదయమ్ – దాచేపల్లి

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దాచేపల్లి పట్టణ, మండల బూత్ లెవెల్ కమిటీలతో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, గురజాల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సిఆర్.రాజన్, గురజాల నియోజక వర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డోర్ టూర్ డోర్ కాంపైనింగ్ గురించి, టెలిగ్రామ్ పోర్టల్ అప్డేట్ గురించి, ప్రతి ఒక్క ఓటర్ ని కలసి మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయాలి తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో దాచేపల్లి పట్టణ, మండల తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కూటమి నాయకులు, మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొన్నారు.