ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే యరపతినేని 

అక్షర ఉదయమ్ – గురజాల 

 

పల్నాడు జిల్లా గురజాల పట్టణం జంగమహేశ్వర పురంలోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ పరిశోధనా సంస్థ, వ్యవసాయ పాలిటెక్నిక్ (విత్తన సాంకేతిక పరిజ్ఞానం) కేంద్రాన్ని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం యూనివర్సిటీలోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు.