ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంకల్ప రూపం
– కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం సాకారం అవుతున్న తరుణం

అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారి, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సంకల్పం, కృషికి ప్రతి రూపం.. కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం బుధవారం జరగబోతోంది. ఇప్పటికే అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యి. నేడు భూమి పూజా కార్యక్రమం జరగనుంది.
సాయంత్రం 5 గంటలకు 49.92 కి.మీ. మేర నాలుగు వరుసలుగా అభివృద్ధి కోసం రూ. 881.61 కోట్లతో భూమి పూజ జరగనుంది.
ప్రధాన నగరాలకు, ప్రధాన రహదారులకు కనెక్టివిటీగా ఉండి, అభివృద్ధికి నోచుకోక, ప్రమాదాలకు నెలవుగా ఇబ్బంది కరంగా ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు ఆది నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అలు పెరుగని కృషి చేశారు. దీంతో కేంద్రం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. తర్వాత విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ, భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, టెండర్లు తదితర అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది.
భూమి పూజ చేసిన అనంతరం అత్యంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు, పల్నాడు ప్రజలకు మేలు చేసేందుకు.. అడుగులు వడివడిగా పడుతున్నాయి.