
అక్షర ఉదయమ్ – గుంటూరు
గత ఎన్నికల్లో ఏపీలో ఏదైతే జరిగిందో ఢిల్లీలో కూడా అదే జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. గుంటూరు జేకేసీ కాలేజ్లో శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంటే ఓటమి తప్పదని ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయని అన్నారు. తాము ఢిల్లీలో ప్రచారం చేసిన సమయంలో స్వచ్ఛమైన నీటి సరఫరా కూడా లేదనే విషయాన్ని గమనించామన్నారు.