పాకిస్థాన్ దాడి
– విచక్షణారహితంగా కాల్పులు
– ముగ్గురు భారత పౌరులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో జిల్లాలోని LOC వెంట ఉన్న ఉరి సెక్టార్ లో పాక్ ఆర్మీ ఆర్టిలరీ షెల్లింగ్స్ కాల్పులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు అమాయకులు చనిపోయారు. పూంచ్ అటవీ శాఖ కార్యాలయం కూడా ధ్వంసమైందని సమాచారం. మృతులు షాహీన్ నూర్ కుమారుడు మహ్మద్ ఆదిల్, అల్తాఫ్ హుస్సేన్ కుమారుడు సలీం హుస్సేన్, షాలు సింగ్ భార్య రూబీ కౌర్‌గా గుర్తించారు. కాగా మరి కొంత మంది గాయపడ్డారు.
ఇందుకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తుంది.