సమస్యలను ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు

సమస్యలను ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు

– పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి ఫిర్యాదులను నేరుగా నరసరావుపేట కలెక్టరేట్ లో లేదంటే ఆయా మండలాల్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కర వేదికలో గాని ఫిర్యాదులు సమర్పించ వచ్చని తెలిపారు. పరిష్కార వేదికకు హాజరు కాలేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేయించు కోవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చెప్పారు. ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన స్థితిని తెలుసుకునేందుకు, సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ చెప్పారు.
అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్) వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నేరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..