
అక్షర ఉదయమ్ – గుంటూరు
బర్డ్ ఫ్లూ కథనాల్లో వాస్తవం లేదని గుంటూరు ప్రజలు ఆందోళన చెందవద్దని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ ఆసుపత్రిలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం అంటూ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, దీనిపై గుంటూరు జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని సూచించారు. బర్డ్ ఫ్లూకు, జీబీఎస్ సిండ్రోమ్ కు సంబంధం లేదన్నారు.