
అక్షర ఉదయమ్ – గుంటూరు
సింగపూర్ లో జరిగిన ఆసియన్ యోగ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో గుంటూరు జిల్లా పెదకాకనికి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని కె. పూజిత ప్రతిభను కనబర్చి 4వ స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు.