పూజారి మెడలో గొలుసు దొంగతనం

అక్షర ఉదయమ్ – మచిలీపట్నం

పూజారి మెడలో బంగారు గొలుసును దొంగలు అపహరించారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మచిలీపట్నం గొడుగు పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకునిగా పూజారి పనిచేస్తున్నారు. స్వామి వారికి పూజ చేస్తుండగా ఆలయంలోకి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. తమను ఆశీర్వదించాలని పూజారిని కోరగా, ఈ క్రమంలో పూజారి మెడలో ఉన్న బంగారపు గొలుసు లాక్కుని బైక్ పై పరారయ్యారు.