కానిస్టేబుళ్ల నైపుణ్యాలకు శిక్షణ

– గుంటూరు జిల్లా పోలీస్

 

కానిస్టేబుళ్ల నైపుణ్యాలకు మెరుగులు పెట్టడమే మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రధాన ఉద్దేశం – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ కానిస్టేబుళ్లకు సర్టిఫికెట్లు అందజేసిన శ్రీ ఎస్పీ గారు.

ఈ శిక్షణ కార్యక్రమమును జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల నుండి 30 మంది కానిస్టేబుళ్లకు 6 రోజులు అనగా ది.03.02.2025 తేదీ నుండి 08.02.2025 తేదీ వరకు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు సుమారు 48 గంటల పాటు నిర్వహించి, కంప్యూటర్ యొక్క ప్రాథమిక అంశాలైన కంప్యూటర్ భాగాలు, MS- word, Ms- Excel, Ms – power point వంటి కంప్యూటర్ అప్లికేషన్స్, CCTNS, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు వంటి పోలీస్ శాఖా పరమైన ఆన్లైన్ అప్లికేషన్స్ గురించి శిక్షణ, అదేవిధంగా ఆంగ్ల భాషలో నైపుణ్యతకు సంబంధించి ఒక అధ్యాపకుడిచే శిక్షణ కూడా ఇప్పుడుంచడం జరిగింది.

6 రోజుల కంప్యూటర్ మరియు ఆంగ్ల భాషకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ లకు శ్రీ ఎస్పీ గారు స్వయంగా సర్టిఫికెట్లను అందజేసి, అభినందించినారు. ప్రతి ఒక్కరిని ఈ శిక్షణకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలని, వాటి ప్రకారం ఇంకా మెరుగైన శిక్షణ ఇవ్వడానికి కృషి చేస్తామని తెలిపారు.

 

“అక్షర ఉదయమ్” న్యూస్