
అక్షర ఉదయమ్ – కొవ్వూరు
విద్యార్థిని పై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కొవ్వూరులో డీఎస్పీ దేవకుమార్ తెలిపిన వివరాల మేరకు భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.