
అక్షర ఉదయమ్ – బాపట్ల
బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.
బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు క్యాబినెట్ ఛాంబర్‌లో రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా కోరారు.
2022లో ఏర్పడిన బాపట్ల జిల్లా, బాపట్ల జిల్లా కేంద్రంగా మారిందని చెప్పారు, ప్రజల నుండి డిమాండ్ పెరిగినప్పటికీ, బాపట్ల నుండి రాష్ట్ర ప్రధాన కార్యాలయం మరియు ఇతర ప్రధాన ప్రాంతాలకు బస్సులు మరియు బస్సుల ఫ్రీక్వెన్సీ ఇంకా పెంచలేదు అన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించాలని ఎమ్మెల్యే గారు మంత్రిని కోరారు. రవాణా మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.