కొవ్వూరులో 10 కేజీల గంజాయి పట్టివేత

అక్షర ఉదయమ్ – కొవ్వూరు

కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ వద్ద 10 కిలోల గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు కొవ్వూరు టౌన్ ఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు. మంగళవారం కొవ్వూరులోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఐదుగురు ముద్దాయిలు స్నేహితులని, అక్రమ మార్గంలో డబ్బుకి అలవాటు పడ్డారని తెలిపారు. డీఎస్పీ దేవకుమార్, సీఐ విశ్వం, సిబ్బంది పాల్గొన్నారు.