అక్షర ఉదయమ్ – కర్నూలు

బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 3 లక్షలు తీసుకొని బెంగుళూరుకు చెందిన మనీషా జాబ్ కన్సల్టెన్సీ మోసం చేసిందని కర్నూలు ఎన్ఆర్ పేటకు చెందిన సమీర్ సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయనను కలిసి సమస్యను వివరించి, న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.