అక్షర ఉదయమ్ – సత్తెనపల్లి

సత్తెనపల్లిలో నివాసం ఉంటున్న మాధవి భర్త నాలుగేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. మాధవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండగా ఆమెకు శివపార్వతి సహకరిస్తోంది. ఆ బంధానికి బిడ్డ అడ్డుగా ఉందని భావించిన మాధవి, శివపార్వతి బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఐదు రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలేస్తుందని అడిగితే అట్లకాడతో వాతలు పెట్టారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారి చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటుండగా చూసిన స్థానికులు శనివారం 1098 కి ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లిని ఆమెకు సహకరిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.