ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన “స్మార్ట్ హీట్ అలెర్ట్ కార్డ్” ను శనివారం స్పెషల్ సిఎస్ జి.జయలక్ష్మి ఆవిష్కరించారు

వేడిని తరిమి కొట్టండి (బీట్ ది హీట్)లో భాగంగా ఈ స్మార్ట్ కార్డు రూపొందించినట్లు తెలియజేసారు. రియల్ టైమ్ లో మీ ప్రాంతంలోని ఉష్ణోగ్రత వివరాలు కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నారు.
గంట గంటకు స్థానికంగా ఉష్ణోగ్రతల అంచనా వివరాలు అందులో ఉంటాయని దాని ప్రకారం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా బయట పడొచ్చు అన్నారు.
ప్రతి ఒక్కరు ఉష్ణోగ్రతల హెచ్చరిక రంగులు వాటి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

???? బ్లూ కలర్
<35°C అంత కంటే తక్కువ సేఫ్ జోన్
???? ఎల్లో కలర్
35°C – 40°C కొంచెం అసౌకర్యం
???? ఆరెంజ్ కలర్
41°C – 44°C ఎక్కువ అసౌకర్యం
???? రెడ్ కలర్
45°C అంత కంటే ఎక్కువ తీవ్ర ప్రమాదం కలిగి ఉంటుందన్నారు.

వీటితో పాటు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు కార్డులో తెలియజేసామన్నారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..