అక్షర ఉదయమ్ – గురజాల
పల్నాడు జిల్లా గురజాల మండలం దైద బిలం “శ్రీ అమర లింగేశ్వర స్వామి వారి దేవస్థానం”లో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విచ్చేయనున్న భక్తుల కొరకు చేయనున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.