ఆహార పదార్థాల కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

అక్షర ఉదయమ్ – పెదనందిపాడు

ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ట్రెయినర్ కలకండ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫుడ్ సేఫ్టీ పై శుక్రవారం పెదనందిపాడు కిరాణా మర్చంట్ అసోసియేషన్ హాల్ లో వ్యాపారులకు ఆహార భద్రత పై శిక్షణా కార్యక్రమం జరిగింది. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. కల్తీ ఆహారం ద్వారా ఏ వ్యక్తికైనా ప్రాణహానీ జరిగితే రూ. 10 లక్షల జరిమానా విధించటం జరుగుతుందని చెప్పారు.