డ్రోన్స్ ద్వారా కాకినాడ తీర ప్రాంతంలో నిఘా, బీచ్ కు కాకినాడ పోలీసులు పటిష్టమైన భద్రత

డ్రోన్స్ ద్వారా కాకినాడ తీర ప్రాంతంలో నిఘా, బీచ్ కు కాకినాడ పోలీసులు పటిష్టమైన భద్రత

 

అక్షర ఉదయమ్ – కాకినాడ

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్, ఐపీఎస్., వారి ఆదేశాల మేరకు, వేసవికాలంలో బీచ్ ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ దృష్ట్యా భద్రతా పరంగా, ముందస్తుగా అవాంఛనీయ సంఘటనలను గుర్తించుటకు, తీర ప్రాంతం వెంబడి పటిష్టమైన రక్షణ కల్పించుటకు కాకినాడ పోర్ట్ ప్రాంతం, NTR బీచ్, లైట్ హౌస్, తూర్పు తీర ప్రాంతం, తిమ్మాపురం, U. కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో డ్రోన్స్ తో భద్రత మరియు నిఘా ఏర్పాటు చేశారు.

సందర్శకులు పోలీసువారి హెచ్చరికలను గుర్తించి వాటిని పాటించాలని, తీర ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త, అనుమానాస్పద వ్యక్తులు పట్ల సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెంటనే తెలియపరచాలని తెలిపారు.

ప్రతి రోజు కాకినాడ బీచ్ మరియు పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా గస్తీ నిర్వహణ జరుగుతుందని తిమ్మాపురం SI శ్రీ మూర్తి తెలిపారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..