“యరపతినేని” వారసుడొచ్చాడు..
– పల్నాడు రాజకీయాల్లో దూసుకుపోతున్న “యరపతినేని నిఖిల్”
– తండ్రికి తగ్గ తనయుడు “నిఖిల్” అంటున్న జనం
– పిన్న వయసులోనే తన వ్యవహార శైలితో అభిమానుల్ని పెంచుకుంటున్న వైనం
– భవిష్యత్తులో తమ నాయకుడు నిఖిలే అంటూ ఫిక్స్ అయిన పార్టీ గణం
మల్లెంశెట్టి లక్ష్మణరావు
చీఫ్ ఎడిటర్ – అక్షర ఉదయమ్
పల్నాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక యువ కెరటం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. పిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా, ఆయన రాజకీయ “వారసుడొచ్చాడు”.. అనే విధంగా దూసుకుని పోతున్న ఆ యువ నేత పల్నాడు ప్రాంత ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాడు. ఆ యువ నేత గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తనయుడు “యరపతినేని సాయి నిఖిల్”.

ఆది నుంచి తన తండ్రి యరపతినేని శ్రీనివాసరావు అడుగు జాడల్లో నడుస్తూ.. రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన యరపతినేని నిఖిల్.. నిత్యం జనంతో మమేకం అవుతూ డైనమిక్ లీడర్ గా పార్టీ నాయకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. తన తండ్రి, గురజాల శాసన సభ్యులు, సీనియర్ పొలిటీషియన్ యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలను శిరసా వహిస్తూ ఆపన్నులకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఓ పక్క యువ నేతగా ఎదిగినా.. ఒదిగి ఉండే మనస్తత్వంతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఒకడిగా కలిసిపోయే గుణంతో యరపతినేని నిఖిల్ కు ప్రత్యేకంగా అభిమానులు సంపాదించి పెట్టింది. గడచిన ఎన్నికల్లో తన తండ్రి యరపతినేని శ్రీనివాసరావుకు విజయాన్ని సాధించి పెట్టేందుకు నిఖిల్ చేసిన ప్రచారం, ఆయన వ్యవహార శైలి కూడా ఓ కారణం అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఆపదలో ఉన్న కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించే సహృదయం ఉన్న నిఖిల్.. తండ్రికి తగ్గ తనయుడు అని జనం కొనియాడుతున్నారు. రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో కూడా దిట్టగా పేరొందిన యరపతినేని శ్రీనివాసరావు తనయుడు నిఖిల్ పల్నాడు రాజకీయాల్లో దూసుకుపోతున్న విలక్షణ తీరు పార్టీ గణాన్ని కట్టి పడేస్తుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా, రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోయే యువ నేతగా పేరు గడించిన యరపతినేని తనయుడు “నిఖిల్” భవిష్యత్తులో తమ నాయకుడు అంటూ పార్టీ గణం ఇప్పటికే ఫిక్స్ అయింది. పిన్న వయసులోనే తన వ్యవహార శైలితో అభిమానుల్ని పెంచుకుంటున్న యరపతినేని తనయుడు “సాయి నిఖిల్” భవిష్యత్తులో పల్నాడు ప్రాంతంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే “యంగ్ లీడర్”గా అవతరిస్తాడు అని అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనేది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య. సో ఫ్యూచర్ లీడర్ “యరపతినేని సాయి నిఖిల్”కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది “అక్షర ఉదయమ్”.
