
అక్షర ఉదయమ్ – మార్కాపురం
అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) ద్వారా ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన మార్కాపురం విచ్చేయుచున్న సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా,IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపియస్., గారు మరియు SSG ఆఫీసర్స్ కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) నిర్వహించి అన్ని భద్రతా ఏర్పాటులను పరిశీలించారు.
దీనిలో భాగంగా అధికారులు ముఖ్యమంత్రి గారి హెలికాప్టరు దిగేందుకు హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న భద్రత ఏర్పాట్లు పరిశీలించి మిగిలిన ఏర్పాటులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. CM కాన్వాయ్ కి సంబంధించిన రూట్ ను పరిశీలించారు.హెలిప్యాడ్ ప్రదేశం, సభా వేదిక, కార్యకర్తల సమావేశం ప్రదేశాన్ని మరియు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, మహిళలు లోపలకి వచ్చే/పోయే మార్గములు, VVIP/VIP వాహనాల పార్కింగ్ స్ధలములు వద్ద బందోబస్తు మరియు భద్రత ఏర్పాటులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు.

మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు హాజరవుతున్నందువలన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధికారులు, ముఖ్య నాయకుల వాహనాలకు మరియు ఇతరుల వాహనాలకు పార్కింగు స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.
వారి వెంట జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వర రావు, SSG అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, SSG డిఎస్పీ పోతురాజు, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, కనిగిరి డిఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్, స్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మార్కాపురం సీఐ సుబ్బారావు, సీఐలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.