ఆ 37 మంది ఎమ్మెల్యేల పని తీరు మారాలి

ఆ 37 మంది ఎమ్మెల్యేల పని తీరు మారాలి

 

  • ఏపీ సిఎం చంద్రబాబు హెచ్చరిక
  • ఎమ్మెల్యేల పని తీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
  • జగన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం
  • ఆర్ఎస్ఎస్ తరహాలో క్యాడర్‌ను సిద్ధం చేసుకోవాలని పిలుపు

 

అక్షర ఉదయమ్ – అమరావతి

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యుల పని తీరు మెరుగు పడిందని, అయితే మరో 37 మంది పని తీరు మరింత మెరుగు పడాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉన్న నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమీక్షలు, వన్‌ టూ వన్‌ భేటీల ద్వారా చాలా మంది పని తీరులో మార్పు వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతి ఎమ్మెల్యే పని తీరుపై నాలుగైదు మార్గాల్లో ఖచ్చితమైన సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఈ నివేదికల ఆధారంగానే పని తీరును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమావేశంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్‌ విషయాన్ని కొందరు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ “నెలకోసారి వచ్చి విజ్ఞత కోల్పోయి మాట్లాడే వారి మాటలకు విలువ లేదు. అర్థం పర్థం లేని మాటల్ని పట్టించు కోవాల్సిన అవసరం లేదు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు” అని వ్యాఖ్యానించారు.

అనంతరం పార్టీ క్యాడర్ నిర్మాణంపై మాట్లాడుతూ ఎలాంటి పదవులు ఆశించకుండా బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా పని చేస్తోందని, అదే స్ఫూర్తితో టీడీపీ కార్యకర్తలను కూడా సైద్ధాంతికంగా బలోపేతం చేయాలని సూచించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.