ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢి ముగ్గురికి తీవ్ర గాయాలు

అక్షర ఉదయమ్ – పర్చూరు

 

పర్చూరు మండలంలోని దేవరపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పర్చూరు నుండి చిలకలూరిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం దాటికి రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డినవారిని ఆసుపత్రికి తరలించారు.